తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కార్యక్రమం హరితహారమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మెుక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకుంటున్న పలు మార్పులను అరికట్టాలంటే అత్యధికంగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల సభ్యులు చొరవ తీసుకుని నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ సత్యం, జడ్పీటీసీ ప్రసాద్, ఎంపీపీ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్