నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో మొత్తం ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా... మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
ఐదు నిమిషాలు అలస్యం...
ఒక్క నిమిషం ఆలస్యమైనా... పరీక్షాకేంద్రంలోకి అనుమతించమన్న నిబంధన వల్ల కొందరు విద్యార్థులు పరుగులు తీశారు. పలు చోట్ల మాత్రం విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి లింగమయ్య ఐదు నిమిషాలు ఆలస్యంగా రావటం వల్ల... ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం నిర్వాహకులు అనుమతించలేదు. చేసేదేమీలేక విద్యార్థి పరీక్ష కేంద్రం నుంచి నిరుత్సాహంగా వెనుదిరిగాడు.