అతి త్వరలో నాగర్ కర్నూలు జిల్లాను గ్రీన్ సిటీగా మారుస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలుమున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు.
- పట్టణంలోని జూనియర్ కళాశాల ఎదురుగా 20 లక్షలతో చిరు వ్యాపారస్థులకు ప్రత్యేక సముదాయాలను నిర్మించడానికి భూమి పూజ చేశారు.
- ఐదు కోట్ల రూపాయలతో 6, 22 వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
- పట్టణ అభివృద్ధిలో భాగంగా ఉయ్యాలవాడ వద్ద జంక్షన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
నాగర్ కర్నూలు జిల్లాను అతి త్వరలో గ్రీన్ సిటీగా మారుస్తానని పేర్కొన్నారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద అతిపెద్ద నేషనల్ ఫ్లాగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రూ. 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని.. త్వరలో రూ. 40 కోట్ల వ్యయంతో పట్టణంలోని అన్ని వార్డులకు సీసీ రోడ్లు పనులు చేపడుతామన్నారు. అతి త్వరలో వెజ్, నాన్ వెజ్ ఏసీ మార్కెట్.. మినీ స్టేడియం పనులను కూడా ప్రారంభించబోతున్నామని గుర్తు చేశారు. అనంతరం మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి ఘటనతో వెనకడుగు వేయం: సజ్జనార్