నాగర్‌కర్నూలు జిల్లా అమ్రబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏకమై యురేనియం తవ్వకాలు చేపడతున్నాయని... దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. యురేనియం వెలికితీత వల్ల పరిసర ప్రాంతాలు ప్రభావితమవుతాయని తెలిపారు. అటవీ సంపదను, అడవులను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల అరుదైన వన్యప్రాణులు నశించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీరు కలుషితమైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడి అటవీ సంపదకు ఎటువంటి నష్టం కలుగకుండా అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: తెరాస ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 2: లక్ష్మణ్