నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లికి చెందిన నిజాముద్దీన్ అతని భార్యకు కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇల్లాలు కాపురానికి రావడం లేదంటూ తరుచూ తాగిన మైకంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఆత్మహత్య చేసుకుంటానని విసిగించేవాడు. కానీ ఈ సారి ఏకంగా నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించాడు. పోలీసులు బిజినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిజాముద్దీన్ బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:రూ. 3 లక్షల కోట్ల అప్పుందని నిరూపిస్తారా?