ETV Bharat / state

'గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ కోసం దీక్ష చేపడతా' - Nagar Kurnool District latest news

తెరాస, భాజపాలు మోసపూరిత పార్టీలని... మహబూబ్​నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి చిన్నారెడ్డి ఆరోపించారు. వారు చెప్పే మాయ మాటలకు మోసపోకుండా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాగర్​కర్నూల్​, అచ్చంపేట పట్టణాల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Graduate MLC Congress Candidate Chinnareddy Election Campaign in Nagar Kurnool District
'గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ కోసం దీక్ష చేపడతా'
author img

By

Published : Mar 7, 2021, 3:07 AM IST

రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని... మహబూబ్​నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. నిరుద్యోగులను తెరాస ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాలపరిమితి ముగిసినా ఇంకా కొత్త కమీషన్​ను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. నాగర్​కర్నూల్​, అచ్చంపేట పట్టణాల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహాక సమావేశంలో.. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్​లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

తెరాస మాట తప్పింది...

నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి... తెరాస ప్రభుత్వం మాట తప్పిందని చిన్నారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. తెరాస పాలనలో చేసిందేమీ లేదన్నారు.

భాజపావి రెచ్చగొట్టే వ్యాఖ్యలు...

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు భాజపా చేస్తోందని... వాటిని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీలను గెలిపించుకునే అవకాశం వచ్చిందని... దీన్ని పార్టీ కార్యకర్తలు వినియోగించుకుని కాంగ్రెస్​ను బతికించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: 'టీఎన్జీవోస్​ను ప్రభుత్వం వదులుకోదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.