ETV Bharat / state

నెలరోజుల్లో ఎల్లూరు పంప్​హౌజ్​ పునఃప్రారంభం!

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎల్లూరు పంప్​హౌజ్ పునరుద్ధరణ చర్యలు ముమ్మరమయ్యాయి. వారం, పది రోజల్లో నీరు ఎత్తిపోయడం పూర్తయ్యే అవకాశం ఉంది. పునః ప్రారంభించేందుకు నెల రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా... పంప్​హౌజ్​ వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది.

author img

By

Published : Oct 19, 2020, 9:32 PM IST

government whip guvvala blarju and mla visit visit pumphouse
నెలరోజుల్లో ఎల్లూరు పంప్​హౌజ్​ పునఃప్రారంభం!

నాగర్​కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ మండలం ఎల్లూరులో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ లో నీట మునిగిన పంప్​హౌజ్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పంప్​హౌజ్ నుంచి నీటిని తోడివేసేందుకు అధికారులు 300 హెచ్​పీ మోటార్లను రెండింటినీ సిద్ధం చేశారు. డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటి వరకు 30, 40 హెచ్​పీ మోటార్లతో తాత్కాలికంగా నీటిని ఎత్తిపోశారు. పంప్​హౌజ్​లో ప్రస్తుతం సుమారు 45 నుంచి 50 మీటర్ల మేర ప్రస్తుతం నీరు నిలిచి ఉంది. నీటి ఎత్తిపోత ప్రక్రియకు కనీసంగా 7 నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

అన్నింటికీ ఒకే సమాధానం!

నీటిని ఎత్తిపోస్తే తప్ప ప్రమాదం ఎందుకు జరిగింది? పంప్ హౌజ్​లోకి నీళ్లు ఎందుకు వచ్చాయన్న విషయాలని చెప్పలేమని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. నీటిని ఎత్తిపోసిన తర్వాత కూడా, మోటార్లు సరిగా ఉన్నాయా? లేదా? ఏవైనా మరమ్మత్తులు అవసరమా? ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? ముందుగానే సరిచూసుకుని వాటిని ఆరబెట్టి తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. సమస్య తెలుసుకుని మరమ్మత్తులు చేపట్టాడనికి కనీసంగా 15 నుంచి 20 రోజుల సమయం పట్టేలా ఉంది.

అనవసర రాద్ధాంతం

ఎల్లూరు పంపుహౌజ్​ను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్​కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ శాసనభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించారు. నీట మునిగిన పంప్​హౌజ్​ను పరిశీలించారు. నీటిని ఎత్తిపోయడానికి ఎంత సమయం పడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమేంటో తెలియకుండానే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని గువ్వల బాలరాజు మండిపడ్డారు. పంప్​హౌజ్ నీటమునిగి తాగు, సాగునీటికి ఇబ్బంది తలెత్తినందున... విపక్షాలు ప్రభుత్వానికి అండగా నిలబడి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప... రాజకీయం చేయడం సమంజసం కాదని హితవు పలికారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని... నెల రోజుల్లో పంప్​హౌజ్​ను పునరుద్ధరించి ఒక్క మోటారు ద్వారానైనా నీటి ఎత్తిపోత ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికారులకు 24 గంటలు శ్రమిస్తున్నారని తెలిపారు.

144 సెక్షన్

ఎల్లూరు పంప్​హౌజ్ వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ సహా పునరుద్ధరణ చర్యలకు ఎలాంటి అంటకం కలగకుండా నీటి పారుదల, ప్రాజెక్టు అధికారులు మినహా ఎవరనీ లోపలకి అనుమతించడం లేదు. పంప్​హౌజ్ నీట మునగడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... సీపీఎం నిరసనకు దిగింది. పాదయాత్రగా ఎల్లూరు లిఫ్ట్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన సీపీఎం శ్రేణుల్ని కొల్లాపూర్ లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంప్ హౌజ్ వద్దకు అనుమతించకోవడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి: ఎల్లూరు పంప్​ హౌజ్ మునకతో తాగు, సాగు నీటి కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.