ETV Bharat / offbeat

కొత్తగా పెళ్లి చేసుకున్నవాళ్లు - మొదటి ఏడాదిలో ఇలా చేయాలి - బంధం ఫుల్​ స్ట్రాంగ్ అయిపోతుందట! - Tips for Newly Married Couples

Tips for Newly Married Couples: కొత్తగా పెళ్లైన వారికి తొలి ఏడాది ఏంతో కీలకమని మానసిక నిపుణులు, కౌన్సిలర్స్ చెబుతున్నారు. ఈ సమయంలో ఎలా వ్యవహరించాలో పలు సూచనలు చేస్తున్నారు.

tips for newly married couples
tips for newly married couples (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 6, 2024, 4:50 PM IST

Tips for Newly Married Couples: ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా కీలకమైన ఘట్టం. ఇద్దరు మనుషుల మధ్య.. రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవాలంటే.. భార్యాభర్తలు కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు పెళ్త్లెన తొలి ఏడాది చాలా కీలకమని అంటున్నారు.

ఒకరినొకరు అర్థం చేసుకోండి..
మామూలుగానే మనకు పరిచయమైన, నచ్చిన వ్యక్తుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాం. అలాంటిది మన జీవిత భాగస్వామి గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే.. ఇతర వ్యక్తులు, విషయాల గురించి కాసేపు పక్కన పెట్టి భాగస్వామికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడంలో శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు పెళ్లయిన మొదటి రోజులే మంచి సమయమని సూచిస్తున్నారు. వాళ్ల ఇష్టాయిష్టాలేంటి? అభిరుచులేంటి? వారి జీవన విధానాలేంటి? మొదలైన విషయాలన్నీ వారి ప్రవర్తన ఆధారంగా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. వారితో ఎక్కువ సమయం కేటాయించి ప్రేమగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల భాగస్వామి గురించి, వారి స్వభావంపై ఓ అవగాహన వస్తుందట.

దాపరికాలు ఉండొద్దు..
పెళ్లయిన కొత్తలో కొంతమంది దంపతులు అన్ని విషయాలనూ సులభంగా పంచుకోలేకపోతుంటారు. దంపతులిద్దరిలో ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎదుటి వారికి చెప్పడానికి కాస్త ఆలోచిస్తుంటారు. 'ఈ విషయం చెబితే వారు ఏమనుకుంటారో ఏమో? ఇది కూడా ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా.. అని అనుకుంటారేమో..' అనే మొహమాటాలు ఇందుకు ప్రధానంగా కారణమవుతాయి. ఈ కారణంతో వాటిని పంచుకోకపోతే ఆ దూరం అలాగే ఉండిపోతుంది. కాబట్టి పెళ్త్లెనప్పటి నుంచే దంపతులు ఎలాంటి విషయాలనైనా ఒకరికొకరు చెప్పుకోవడం, అందులోని క్లిష్ట సందర్భాల్ని కలిసి ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా పెళ్లైన నాటి నుంచీ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలూ లేకుండా వారి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుందని అంటున్నారు.

గొడవలు, అలకలు సహజమే..
భార్యాభర్తల బంధం అంటే భారం కాదు.. బాధ్యత అని గుర్తించాలి. సాధారణంగానే పెళ్త్లెన కొత్తలో ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న అలకలు, గొడవలు సహజంగానే జరుగుతుంటాయి. అయితే.. ఇలాంటి సందర్భాల్లో మీ భాగస్వామి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాకాకుండా ఆ కోపాన్ని అలానే కొనసాగిస్తే.. ఇద్దరి మధ్య దూరం రెట్టింపు అవుతుందని అంటున్నారు. కాబట్టి గొడవలు జరిగే సందర్భాల్లో కోపతాపాలకు సెలవిచ్చి మరీ భాగస్వామికి అండగా ఉంటే వారు ఎంతో సంతోషిస్తారట. అలాగే మీపై మరెంతగానో ప్రేమ పెరిగిపోతుందని అంటున్నారు.

ఇరు కుటుంబాలతో కలుపుగోలుగా..
దాంపత్య బంధం అంటే కేవలం భార్యాభర్తలే కాదు.. రెండు కుటుంబ సభ్యులు కూడా అందులో భాగమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోతే.. ఇద్దరూ అర్థం చేసుకోలేక గొడవపడుతుంటారు. అందుకే ఇద్దరూ ఇరు కుటుంబాలతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలి. తరచూ అత్తమామలు, దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లడం, ఫోన్లో మాట్లాడుతుండడం.. వంటివి చేయడం వల్ల వారితో దంపతులకుండే అనుబంధం మరింత దృఢంగా మారి.. భార్యాభర్తల అనుబంధం కూడా పటిష్టం అవుతుందని అంటున్నారు.

పరస్పరం గౌరవించుకోవాలి..
మన దాంపత్య జీవితం కలకాలం సుఖంగా సాగాలంటే.. ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవించడం, ఎదుటి వారికి నచ్చినట్లుగా మెలగడం.. వంటివి కూడా ముఖ్యమేనని నిపుణులు అంటున్నారు. అయితే.. ఈ విషయంలో కొంతమంది మాత్రం విభేదిస్తారు. 'వారికి నచ్చినట్లుగా నేనెందుకు చేయాలి? వారికోసం నా ఇష్టాన్ని ఎందుకు వదులుకోవాలి?' అనే స్వభావంలో ఉంటారు. పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా.. వీటివల్ల పెద్ద సమస్యలేమీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. కానీ పెళ్త్లెన తర్వాత కూడా వీటినే కొనసాగిస్తానంటే మాత్రం దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదొడుకులు తలెత్తే అవకాశం ఉంటుందట. కాబట్టి పెళ్త్లెన తొలి రోజుల నుంచే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ప్రతి విషయంలో ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి సంతోషం కోసం మరొకరు ఏది చేయడానికైనా సిద్ధపడడం.. వంటివి అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటూ, కలకాలం చిలకాగోరింకల్లా కలిసిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని అంటున్నారు.

పండక్కి ఇల్లు క్లీన్​ చేస్తున్నారా? - ఈ తప్పులు చేస్తే ఎంత శుభ్రం చేసినా మురికిగానే! - House Cleaning Tips in Telugu

బ్యాచిలర్​ బ్రోస్..​ వంట తేడా కొట్టేస్తే ఏం చేస్తారు? - ఈ టిప్స్ పాటస్తే నో టెన్షన్! - Cooking Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.