How to Get Rid from Nara Drishti : నరదిష్టిని చాలా మంది నమ్ముతారు. ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనీ.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారినపడకుండా ఉండాలన్నా, లేదా ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నా.. ఈ పరిహారాలు పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఎంత దృష్టి శక్తినైనా ఇట్టే తొలగించుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం.
సముద్ర జలాలకు నరదిష్టి పోగొట్టే శక్తి ఉందట. కాబట్టి.. ఎవరైనా సరే వీలైనప్పుడు శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్లి ఆ జలాలను ఒక బాటిల్లో తెచ్చుకోండి. మీరు వ్యాపారం చేసే చోట, ఇంటి పరిసరాల్లో కానీ వాటిని చల్లండి. అలా చల్లడం ద్వారా ఆ ప్రాంతాలకు ఉన్న కను దిష్టి మొత్తం తొలగిపోతుంది. వ్యక్తులకు ఉన్న నరదిష్టి పోవాలంటే.. రోజూ కాస్త దొడ్డు ఉప్పు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నరదిష్టి పోగొట్టే శక్తి సాంబ్రాణి ధూపానికీ ఉంది. అమవాస్య లేదా పౌర్ణమి, అష్టమి, నవమి తిథుల్లో.. సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఈ ధూపం వెయ్యాలి. ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా వరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
దృష్టి దోషం పోవాలంటే.. మంగళవారం ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డు ఉప్పును మూటకట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కానీ కట్టాలి. బుధవారం ఆ మూటను ఓపెన్ చేసి దానిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదంటే.. పారే నీటిలో వదిలేయాలి. ఇలా ప్రతి మంగళవారం చేస్తుంటే.. ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న మొత్తం కను దిష్టిని తొలగించుకోవచ్చు.
ఈ ప్రత్యేకమైన విధివిధానం పాటించడం ద్వారా వ్యాపారం స్థలం లేదా ఇంటికి ఉన్న నరదిష్టిని పూర్తిగా పోగొట్టుకోవచ్చంటున్నారు. అదేంటంటే.. కొద్దిగా ఆవు పేడ తీసుకొని అందులో కాస్త పచ్చకర్పూరం, కస్తూరి, పసుపు, సెంటు కలిపి దాన్ని మంగళవారం ఆయా ప్రాంతాలలో కొద్దిగా చల్లాలి. ఇలా చేయడం సమస్త దృష్టి దోషాన్ని తొలగింపచేసుకోవచ్చని చెబుతున్నారు.
అదేవిధంగా.. వినాయకుడి ఆలయంలో బుధవారం కొబ్బరి లేని ఖాళీ చిప్పలో ఇంటూ(x) ఆకారంలో వత్తులు వేసి నూనెతో దీపం వెలిగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఇలా వెలిగించిన వారికి కను దిష్టి మొత్తం పోతుందట.
బంగాళదుంపలతో కూడా నరదిష్టిని పోగొట్టే అద్భుతమైన పరిహారం ఒకటుంది. అదేంటంటే.. ఎప్పుడైనా సరే మంగళవారం లేదా గురువారం ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి చల్లార్చి వాటిల్లో కొద్దిగా ఉప్పు కలిపి ఉదయం 6 నుంచి ఒంటి గంటలోపు గోవుకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేయడం ద్వారానూ ఎంత తీవ్రమైన దృష్టి దోషం ఉన్నా దాని నుంచి సులభంగా బయటపడవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
సకల బాధలను తొలగించే 'శని ప్రదోష' పూజ! ఎలా చేసుకోవాలో తెలుసా?
మీ ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు- ఎవరికీ ఎలాంటి శని బాధలు ఉండవ్!