ETV Bharat / technology

విదేశీ ప్రయాణానికీ 'డిజియాత్ర'- ఇకపై ఎయిర్​పోర్ట్స్​లో నో చెకింగ్..! - Digi Yatra Airports in India - DIGI YATRA AIRPORTS IN INDIA

Digi Yatra Airports in India: విమానాల్లో విదేశాలకు వెళ్లే వారికీ ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీని వినియోగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Digi Yatra Airports in India
Digi Yatra Airports in India (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 6, 2024, 4:57 PM IST

Digi Yatra Airports in India: విమానాల్లో విదేశాలకు వెళ్లే వారికి సైతం ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ)ని వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతంలో కేవలం దేశీయ మార్గాల్లో ప్రయాణం కోసం మాత్రమే ఈ సేవలు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం విదేశీ ప్రయాణాలకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జూన్‌లో దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ ఆరంభించనుందని డిజియాత్ర సీఈఓ కె.సురేశ్‌ తెలిపారు. "అంతర్జాతీయ ప్రయాణానికి ఎఫ్‌ఆర్‌టీ వినియోగించాలంటే, ఇక్కడి నుంచి విమానం గమ్యం చేరే దేశం కూడా అంగీకరించాలి. అందుకే 2025 జూన్‌లో రెండు దేశాల మధ్య ప్రయాణానికి ఈ సదుపాయాన్ని వినియోగించాలన్నది తమ ప్రణాళికగా" సురేశ్‌ తెలిపినట్లు హిందుస్థాన్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ఎఫ్‌ఆర్‌టీతో డిజియాత్ర సేవలు:

  • దేశీయ మార్గాల్లో ఎఫ్‌ఆర్‌టీని వినియోగించుకునేందుకు డిజియాత్ర యాప్‌ను అభివృద్ధి చేశారు.
  • ఆధార్‌ ఆధారంగా ఇందులో పెద్దవారితో పాటు మైనర్ల వివరాలను కూడా నిక్షిప్తం చేయొచ్చు.
  • ఇందుకోసం ప్రతి ఒక్కరి ముఖాన్ని సెల్ఫీ ద్వారా చిత్రీకరించాలి. తదుపరి ప్రయాణానికి ముందు బోర్డింగ్‌ పాస్‌ వివరాలను సంబంధిత ఫీచర్‌లో జత చేస్తే సరిపోతుంది.

అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి ప్రవేశం:

  • హైదరాబాద్, విశాఖపట్నం, దిల్లీ, బెంగళూరు, వారణాసి, కోల్‌కతా, ముంబయి, పుణె, కోచి.. తదితర ఎయిర్​పోర్ట్స్​లో డిజియాత్ర కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను కేటాయించారు.
  • అక్కడ ఉండే స్కానర్‌ వద్ద మొబైల్‌లోని డిజియాత్ర యాప్‌లో ఉన్న బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేసి, అక్కడే ఉన్న కెమెరా ఎదుట మన ఫేస్ ఉంచితే సెకన్ల వ్యవధిలోనే అనుమతి వచ్చి గేట్లు ఆటోమేటిక్‌గా తెరచుకుంటాయి.
  • ఎవరూ కూడా డాక్యుమెంట్లను ఫిజికల్‌గా తనిఖీ చేసే పరిస్థితి ఉండదు. దీంతో అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం దేశీయ గమ్యస్థానాలకే ఈ సదుపాయాన్ని అనుమతిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఇ-పాస్‌పోర్ట్స్:

  • అంతర్జాతీయ ప్రయాణాలకు పాస్‌పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్‌ వ్యవహారాలుంటాయి.
  • అందువల్ల బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్, వీసా జారీ వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని డిజియాత్ర సీఈఓ పేర్కొన్నారు.
  • ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం వచ్చే ఏడాది ఇండియన్స్​కు ఇ-పాస్‌పోర్ట్‌ జారీ చేసేందుకూ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
  • ఇప్పటికే సింగపూర్‌తో పాటు కొన్ని ఐరోపా దేశాలు ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నాయి.

పండగ వేళ ఆన్​లైన్ సేల్స్ జోరు- వారంలోనే రూ.54వేల కోట్ల ఆర్డర్స్​ - Festive Season Online Sales

కామో థీమ్​తో టాటా పంచ్ నయా ఎడిషన్- ప్రీమియం ఫీచర్స్​తో బడ్జెట్ ధరలో లాంచ్ - Tata Punch Camo Edition Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.