నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన 37 సర్వే నంబర్లో భీమా వెంకటయ్య, బాలస్వామి అనే రైతులకు చెందిన 12 ఎకరాల భూమిలో ఎనిమిది ఎకరాలు ఇతరుల పేరున రిజిస్టర్ అయిందని తెలుసుకొని సుమారు 100 మంది కర్షకులతో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ భూమి తలకొండపల్లి గ్రామానికి చెందిన వేరే వ్యక్తుల పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించినట్లు రైతులు తెలిపారు. వెల్దండ తహసీల్దార్ నాగ వీరేశం, ఎస్సై వీరబాబు 10 రోజుల్లోగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: వడగండ్ల వానతో రైతున్న కంట కన్నీరు