ETV Bharat / state

మాజీమంత్రి జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల ఘర్షణ - మాజీ మంత్రి జూపల్లి తాజా వార్తలు

కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీమంత్రి జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి చెందిన వర్గాల మధ్య తగాదా ఘర్షణకు దారితీసింది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది గ్రామంలో పహారా కాస్తున్నారు.

Molachinthalapalli village
మొలచింతలపల్లి గ్రామం
author img

By

Published : Mar 21, 2022, 10:58 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామములో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల నుంచి గ్రామంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుండగా.. ఈ విషయంమై జూపల్లి వర్గం పోలీస్​స్టేషన్​లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

అదే రోజు రాత్రి ఎమ్మెల్యే వర్గానికి చెందిన అనుచరులు, మాజీ మంత్రి జూపల్లి వర్గం గొడవకు దిగి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు గాయలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. ఇరు వర్గాలు పోలీస్​స్టేషన్​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్ఠానం షాక్.. బాధ్యతల నుంచి తప్పించిన పీసీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.