ETV Bharat / state

నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు ఆర్పిన అటవీ సిబ్బంది - nallamala forest caught fire

నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలను అటవీ అధికారులు ఆర్పివేశారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అక్టోపస్ వ్యూపాయింట్​ నుంచి నీలారం బండల వరకు సుమారు 12 హెక్టార్ల మేర మంటలు విస్తరించినట్లు తెలిపారు.

forest officers put out fire in nallamala forest in nagarkurnool district
నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు ఆర్పిన అటవీ సిబ్బంది
author img

By

Published : Mar 2, 2021, 9:28 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకుని అక్టోపస్ వ్యూపాయింట్ నుంచి నీలారం బండల వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర మంటలు ఎగిసి పడ్డాయి.

సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రాగా అటవీశాఖ సిబ్బంది ఆర్పివేశారు. మళ్లీ రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సుమారు 12 హెక్టార్ల మేర మంటలు విస్తరించాయి. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విస్తీర్ణం అధికంగా ఉండటంతో మంటల్ని అదుపులోకి తేవడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఎట్టకేలకు రాత్రి ఒంటిగంట తర్వాత మంటల్ని ఆర్పేసినట్లుగా దోమలపెంట రేంజ్ అధికారి రవిమోహన్ భట్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.