ETV Bharat / state

'కల్వకుర్తి ఎత్తిపోతలతో పొలాలు సస్యశ్యామలం' - నాగర్ కర్నూల్ లో జాతీయ జెండా ఆవిష్కణించిన గువ్వల బాలరాజు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో బీడుపడ్డ పంటపొలాలు సస్యశ్యామలంగా మారాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

'కల్వకుర్తి ఎత్తిపోతలతో పొలాలు సస్యశ్యామలం'

author img

By

Published : Aug 15, 2020, 12:59 PM IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో బీడుపడ్డ పంటపొలాలు సస్యశ్యామలంగా మారాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, జడ్పీ ఛైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి పాల్గొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈఏడు జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గువ్వల బాలరాజు పేర్కొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.