ETV Bharat / state

కేఎల్​ఐ ప్రాజెక్టును పరిశీలించిన క్షేత్ర స్థాయి అధికారులు.. ఏమన్నారంటే! - కేఎల్​ఐ ప్రాజెక్టును పరిశీలించిన క్షేత్ర స్థాయి అధికారులు

గాలి సక్రమంగా బయటకు వెళ్లలేకపోవడం వల్లే కేఎల్​ఐ ప్రాజెక్టులో మూడో మోటార్​ పేలిపోయిందని క్షేత్ర స్థాయి అధికారులు గుర్తించినట్లు సమాచారం. అధికారికంగా మాత్రం ఆ వివరాలు ఇంకా వెల్లడించలేదు. నిపుణులు వచ్చి పరిశీలించిన తర్వాతే పరిస్థితి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Field level officials examining the KLI project
కేఎల్​ఐ ప్రాజెక్టును పరిశీలించిన క్షేత్ర స్థాయి అధికారులు.. ఏమన్నారంటే!
author img

By

Published : Nov 3, 2020, 11:14 PM IST

నాగర్​ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కేఎల్​ఐ ప్రాజెక్టులో గాలి బయటకు వెళ్లలేకపోవడం వల్లే మూడో మోటార్​ పేలిపోయిందని క్షేత్ర స్థాయి అధికారులు గుర్తించినట్లు తెలిసింది. పేలుడు ధాటికి మోటార్ దెబ్బ తినడం వల్ల విడి భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గత నెల 16న మిషన్ భగీరథ పథకానికి ఎల్లూరు నుంచి నీటిని అందించడానికి పంప్​హౌస్​లో మూడో మోటార్​ను ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దంతో పేలి పోయింది. ఫలితంగా సర్జ్​పూల్​ నుంచి పంప్​హౌస్​లోకి నీరు చేరి.. మోటార్లు పూర్తిగా నీట మునిగాయి. ఈ క్రమంలో నీటిని తోడివేసిన అనంతరం స్థానిక క్షేత్ర స్థాయి అధికారులు పరిస్థితిని పరిశీలించారు.

సాధారణంగా నీటి ఎత్తిపోతలు ప్రారంభించే క్రమంలో సిబ్బంది మొదట కంప్యూటర్ ద్వారా గాలిని బయటకు పంపించాలి. గాలి సక్రమంగా బయటకు పోకపోవడం వల్లే మూడో మోటార్​ను ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే పేలి పోయిందని అధికారులు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. అధికారికంగా మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదు. నిపుణులు వచ్చి పరిశీలించిన తర్వాతే పరిస్థితి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు మిషన్ భగీరథ పథకానికి నీరు అందించేందుకు గానూ ఐదో మోటార్​ను సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 20 నుంచి ఐదో మోటార్​తో నీటిని తోడి.. ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రాజెక్టులో ఏ సమస్య ఉన్నా.. ఇంజినీరింగ్ అధికారులకు మాత్రమే తెలియాలని ఎలాంటి సమాచారం బయటకు చెప్పొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేఎల్​ఐ ప్రాజెక్టు వద్ద పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కొత్త వ్యక్తులను పంప్​హౌస్​లోనికి అనుమతించడం లేదు.

ఇదీ చూడండి.. ఉస్మానియాలో హరితహారంపై సీఎస్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.