నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ఆవరణలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆన్లైన్లో ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల సత్వర న్యాయం జరుగుతుందని వీటి సేవలు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల కట్టడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

నాగర్‌కర్నూల్ కోర్టు ఆవరణలో కొనసాగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇంఛార్జ్ కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు న్యాయమూర్తులు రఘురాం, రవికుమార్, న్యాయమూర్తులు శీతల్, మురళీ మోహన్ హాజరయ్యారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును కలెక్టర్, ఇతర న్యాయమూర్తులు, ఎస్పీ సాయి శేఖర్ సందర్శించారు.
