నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమానుకు చెందిన 800 మంది రైతులు 2012లో పత్తి, మొక్కజొన్న పంట వేసి ఎకరాకు 400 చొప్పున అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాకు బీమా ప్రీమియం చెల్లించారు. నష్టపోయిన పత్తి పంటకు డబ్బులు వచ్చాయి. మొక్కజొన్న పంట వేసిన అన్నదాతలకు రాలేదు. ఏడాదిపాటు కర్షకులు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. 2018 జనవరిలో కేంద్ర సమాచార కమిషన్కు అప్పీలు చేశారు. స్వీకరించిన కేంద్ర సమాచార కమిషన్ బీమా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కంపెనీ ముందు చూపుతో నెల రోజుల క్రితమే 800 మంది కర్షకుల ఖాతాల్లో 18 లక్షల 94 వేల నగదు జమా చేసింది. సమాచారం కమిషన్ నుంచి నోటిసులు రావడం వల్లే రైతులకు నష్టపరిహారం అందజేసిందని న్యాయవాది శ్రీరామ్ ఆర్యా తెలిపారు.
ఇవీ చూడండి: బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర