నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద విత్తన మేళా నిర్వహించారు. ఒకే చోట అన్నిరకాల విత్తనాలు దొరుకుతాయన్న ప్రకటన చూసిన పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. విత్తనాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట కావాల్సినవి కొనుక్కోవచ్చనుకున్న కర్షకులకు నిరాశే మిగిలింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన అన్నదాతలకు అక్కడు రెండు మూడు రకాల విత్తనాలు మాత్రమే ఉండటం చూసి ఆగ్రహం చెందారు. పరిశోధన అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఇదీ చూడండి : రేపు సీడబ్ల్యూసీ భేటీ.. రాజీనామా యోచనలో రాహుల్