నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాములు అనే రైతు పొలం దున్నేందుకు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. ప్రమాదంలో రాములు తీవ్రంగా గాయపడగా... స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలోనే మరణించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎస్సై మహేందర్ వివరించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తర్నికల్ గ్రామ సర్పంచ్ పాండు గౌడ్ కోరారు.
ఇదీ చదవండి : డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందికి టోకరా