ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో చెక్కుల పంపిణీ

పేద ప్రజలకు అండగా ఉండేందుకే అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

distribution of kalyana lakshmi and shadi mubarak checks in nagarkurnool
నాగర్​కర్నూల్​లో చెక్కుల పంపిణీ
author img

By

Published : Aug 13, 2020, 1:29 PM IST

పేద ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటూ.. ఒక అన్నలా బిడ్డలను ఆదుకుంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 30 లక్షల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాగర్​కర్నూల్​, తిమ్మాజీపేట్, బిజినాపల్లి మండలాలకు చెందిన 403 మందికి లబ్ధి చేకూరింది.

ఒకప్పుడు బీడుపడ్డ పంట పొలాలు ఇప్పుడు పచ్చగా మరాయని... రైతులు మూడు కాలాల్లో పంటలు పండించుకుంటున్నారని ఇదీ కేసీఆర్​తోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. కరోనాను జయించిన 86 ఏళ్ల వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.