కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తక్షణమే చేపట్టాలని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి(narayana murthy on paddy) విజ్ఞప్తి చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ఎఫ్సీఐ, కేంద్ర ప్రభుత్వానిదేనని(narayana murthy on fci) అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతు పండించిన ధాన్యం మొలకలు వచ్చి నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, ఎఫ్సీఐ ఇప్పుడు ధాన్యం(narayana murthy fire on central govt) కొనుగోలు చేయబోమని అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
రైతన్న సినిమాను ఆదరించండి
రైతుల కష్టాలు అద్దం పట్టేలా అన్నదాతల కన్నీటి గాథ.. తన రైతన్న సినిమా(raithanna movie) అని ఆయన తెలిపారు. ప్రజలందరూ సినిమాను ఆదరించాలని నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన చిత్రం రైతన్న మూవీ ప్రమోషన్ కోసమై నాగర్ కర్నూల్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతన్న చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడాలని కోరారు.
ఎఫ్సీఐ ధాన్యం కొనాల్సిందే
రైతులు పండించిన వరి ధాన్యాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నారాయణ మూర్తి(narayana murthy demands central govt) డిమాండ్ చేశారు. రైతుల నుంచి ఏ బియ్యమైనా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాల్సిందేనన్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పిన ప్రధాన మంత్రి మోదీ పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. చట్టాల రద్దు కోరుతూ పోరాటం చేసి మృతిచెందిన రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని పండించవద్దని కనీసం మూడేళ్ల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు.
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనాలి. వారికి తప్పకుండా కొనాల్సిందే. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇప్పటికీ చాలా కల్లాల్లో ధాన్యం రైతులు ఆరబోస్తున్నారు. వరిధాన్యం కుప్పల వద్దే అన్నదాతలు కుప్పకూలుతున్నారు. అకాల వర్షాలు వచ్చి మొలకలు వస్తున్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ మాత్రమే. వెంటనే రైతుల నుంచి ఏ ధాన్యమైనా కొనాల్సిందే. ఎఫ్సీఐ ఏర్పడింది అందుకే కదా. 1955లో బాబా సాహెబ్ అంబేడ్కర్ ధరల నియంత్రణ, ఆహార భద్రత చట్టం తెచ్చారు. తక్షణమే ఆ చట్టాన్ని అమలు చేయాలి. రైతుల వద్ద ధాన్యాన్ని ఎఫ్సీఐ తక్షణమే కొనుగోలు చేయాలి. - ఆర్.నారాయణ మూర్తి, సినీ దర్శకుడు
ఇవీ చూడండి: