ప్రజలకు, రైతులకు ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా త్వరగా పరిష్కరించడం కోసమే సీఎం కేసీఆర్... ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, హనుమంత్ రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్ నాయక్ కలిసి ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. భూ సమస్యలు వేగంగా పరిష్కరించడం కోసమే ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
ఈ పోర్టల్ ద్వారా ఎలాంటి మోసాలకు తావు ఉండదని, నెలల తరబడి వీక్షించే అవసరం రైతులకు ఉండదని వివరించారు.
ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే వారికే ఒక రోజు నిర్ణయిస్తారని, ఆరోజు వచ్చి సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని హనుమంత్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ధరణి పోర్టల్‌కు సంబంధించిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, స్కానర్లు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు.
నవంబర్ 2 నుంచి జిల్లాలో పోర్టల్‌ను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ధరణి'లో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం