ETV Bharat / state

'నల్లమల ప్రాంత రోగులకు మెరుగైన వైద్యం అందించాలి' - అచ్చంపేట తాజా వార్తలు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది కొరత ఉందని.. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లమల్ల ప్రాంతంలోని రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

'నల్లమల ప్రాంత రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'

author img

By

Published : Jul 8, 2020, 8:56 AM IST

నాగర్‌ కర్నూల్‌ జిల్లా నల్లమల్ల ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యా నాయక్ కోరారు. అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సీపీఎం నాయకులు ప్లకార్డులు పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది కొరత ఉందని.. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లమల్ల ప్రాంతంలోని రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో స్కానింగ్, ఎక్స్‌రే లాంటి పరికరాలు ఉన్న వాటిని వాడుకోకుండా పట్టించుకోవడం లేదన్నారు.

రోగులకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఆస్పత్రిలో రోగులు, బాలింతలు, ప్రసూతికి వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.