రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తో కలిసి జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారి జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్నానని మల్లు రవి తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే మొట్టమొదటి ప్రయత్నంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు మోదీ... రాహుల్‌గాంధీకి మధ్యే కానీ కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి:ఎన్నికల వాయిదాకై కోర్టుకెక్కిన ఇందూరు రైతులు