ETV Bharat / state

శ్రీశైలం అగ్నిప్రమాదస్థలికి వెళ్తుండగా రేవంత్​ అరెస్ట్​

author img

By

Published : Aug 22, 2020, 1:07 PM IST

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర ప్రమాద ఘటన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్​ రెడ్డి కోరారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యతన్నారు.

revanth reddy
శ్రీశైలం అగ్నిప్రమాదస్థలికి వెళ్తుండగా రేవంత్​ అరెస్ట్​

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర ప్రమాద ఘటన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల మండలం లత్తీపూర్ పెట్రోల్ బంకు వద్ద రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కన్నుంచి ఉప్పునూతల పోలీసు స్టేషన్​కు తరలించారు.

మృతులకు రూ.కోటి పరిహారం అందించాలి..

అరెస్టు చేయాల్సింది తమను కాదని, ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావులను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్​ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చే దిశగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుల కుటుంబాలను పరామర్శించాకే వెళ్తామన్నారు.

ఉప్పునూతనలో కాంగ్రెస్ ఆందోళన

ఘటన జరిగిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యతన్నారు. రేవంత్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పునూతలలో ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి : శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.