ETV Bharat / state

బోగస్ ఓట్లు నమోదు చేశారంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన - నాగర్ కర్నూల్ జిల్లాలో బోగస్ ఓట్లు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో అధికారులు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేశారని ఆరోపిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ కృష్ణ ఆందోళన చేపట్టారు. అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఎన్నికల్లో తెరాస గెలవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

bogas votes in nagar kurnool district
అచ్చంపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
author img

By

Published : Apr 23, 2021, 8:47 PM IST

తెరాస పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో పుర ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని నాగర్ కర్నూల్​ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆరోపించారు. జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో అధికారులు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేశారని ఆరోపిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు తెరాస అభ్యర్థి ఇంటి నంబర్​పై అధికారులు 17 బోగస్ ఓట్లు నమోదు చేశారని వంశీ కృష్ణ ఆరోపించారు. స్థానికులు కాని 120 మందిని ఓటర్లుగా నమోదు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్​ను సంప్రదించగా తాను తిరస్కరించిన ఓటర్లను కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటున ఓటర్లుగా నమోదు చేశారని తెలిపారు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్న తహసీల్దార్... జిల్లా కలెక్టర్​తో మాట్లాడి నకిలీ ఓటర్లను తొలిగిస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: 'గిట్టుబాటు ధరలే లేవంటే... ఈ కమీషన్​ ఏజెంట్ల మోత ఒకటి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.