ETV Bharat / state

నల్లచట్టాలను తీసుకొచ్చిన ఘనత ప్రధానిదే: రేవంత్​ - telangana varthalu

కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్​ చేశారు. దిల్లీలో రైతు దీక్షకు మద్దతుగా ఈ నెల 16న రంగారెడ్డి జిల్లా రావిరాల వద్ద ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నల్లచట్టాలను తీసుకొచ్చిన ఘనత ప్రధానిదే: రేవంత్​

author img

By

Published : Feb 13, 2021, 10:51 PM IST

Updated : Feb 13, 2021, 11:02 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల, గోల్లోనిపల్లి, చౌదరిపల్లి, రాగాయిపల్లి గ్రామాలలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర 7వ రోజు కొనసాగింది. రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, పాల్గొన్నారు. రాగాయిపల్లి వరకు చేరుకున్న పాదయాత్రకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి రాజన్న, ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఈ చట్టాల గురించి ప్రతి ఒక్కరు చర్చించాలని రేవంత్​ అన్నారు. చట్టాల గురించి తెలుసుకున్న వారు తెలియని వారికి తెలియజేసే విధంగా కృషి చేయాలని కోరారు.

పేదలకు భూములను పంచి పెట్టిన ఘనత కాంగ్రెస్​దేనని... అదానీ, అంబానీల కోసం నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మూడు చట్టాలకు మొదట్లో వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు.

దిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతు దీక్షకు మద్దతుగా ఈ నెల 16న రంగారెడ్డి జిల్లా రావిరాల వద్ద ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏ పార్టీకి చెందిన వారైనా... రైతులకు మద్దతు ఇచ్చేందుకు పార్టీ జెండాతో పాటు రైతు జెండాను పట్టుకుని ముగింపు సభకు హాజరుకావాలని కోరారు.

నల్లచట్టాలను తీసుకొచ్చిన ఘనత ప్రధానిదే: రేవంత్​

ఇదీ చదవండి: బ్రహ్మణవెల్లంల నుంచి హైదరాబాద్​కు ఎంపీ కోమటిరెడ్డి పాదయాత్ర

Last Updated : Feb 13, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.