ETV Bharat / state

10 లక్షలు ఇచ్చి బెదిరించారు.. ఇవిగో నోట్ల కట్టలు - congress

తెరాస నేతలు తనను బెదిరించి నామినేషన్​ ఉపసంహరించుకునేట్లు చేశారని గగ్గలపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి దొడ్ల వెంకటనారాయణ డీఆర్​వోకు ఫిర్యాదు చేశారు. తెరాస అభ్యర్థి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

10 లక్షలు ఇచ్చి బెదిరించారు
author img

By

Published : Apr 29, 2019, 9:53 PM IST

తెరాస అభ్యర్థి తనను బెదిరించి నామినేషన్​ ఉపసంహరించుకునేట్లు చేశారని నాగర్​కర్నూల్​ జిల్లా గగ్గలపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి దొడ్ల వెంకటనారాయణ డీఆర్​వోకు ఫిర్యాదు చేశారు. తనకు రూ.10 లక్షల నగదు ఇచ్చారని తెలిపారు. నోట్లకట్టలు తీసుకుని డీఆర్​వో ఆఫీసుకు వచ్చారు. అనంతరం డబ్బు కట్టలను మీడియా ముందు ప్రదర్శించారు. తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్​రెడ్డి అనుచరులు కారులో ఎక్కించుకొని.. బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్​ అభ్యర్తి నామినేషన్​ వెనక్కి తీసుకోవడం ఫలితంగా తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్​రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.

10 లక్షలు ఇచ్చి బెదిరించారు

ఇవీ చూడండి: రంజాన్​ పండుగ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష

Intro:TG_MBNR_7_29_TRS_CONG_WITHDRAW_THREAT_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) తనను బెదిరించి ఎంపీటీసీ నామినేషన్ ను విత్ డ్రా చేయించుకున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొడ్ల వెంకట్ నారాయణరెడ్డి ఆరోపించారు.
నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లీ ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొడ్ల వెంకట నారాయణ రెడ్డి నిన్న తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నాడు... కానీ నేడు అనూహ్యంగా తనను చంపుతానంటూ బెదిరించి 10 లక్షల రూపాయలు తన భార్య బంధువులకు ఇచ్చి తనను నామినేషన్ విత్ డ్రా చేయించారు అంటూ.... జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యాడు. ఇది ఇలా ఉంటే తనను బెదిరించిన వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి అయిన ఈశ్వర్ రెడ్డి అంటూ ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు .నిన్న తనను దొడ్ల ఈశ్వర్ రెడ్డి అతని అనుచరులు కారులో ఎక్కించుకొని వెళ్లి తనను తన కుటుంబ సభ్యులను చంపుతానంటూ బెదిరించి నాపై పోటీగా నామినేషన్ వేస్తావా అంటూ బెదిరించినట్లు నారాయణ రెడ్డి ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విత్డ్రా తో నిన్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి విజయం ఖాయమైనట్లు ఏకగ్రీవ ఎన్నిక జరిగినట్లు మరోవైపు ప్రకటన వెలువడింది. కానీ.... ఈ రోజు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం పి టి సి అభ్యర్థి పది లక్షల రూపాయలు చేతిలో పట్టుకొని కలెక్టర్ కార్యాలయం కు కాంగ్రెస్ నాయకులతో కలిసి వచ్చారు. ఈ పైసలు ఇచ్చి తనను బెదిరించినట్లు డిఆర్ఓ మధుసూదనాయ తెలిపాడు. తనను బెదిరించి నామినేషన్ ను విత్ డ్రా చేయించిన టిఆర్ఎస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కలెక్టర్ లేకపోవడంతో డిఆర్ఓ మధుసూదన్ నాయక్ కు ఫిర్యాదు చేసి అనంతరం జిల్లా ఎస్పీ ఈ సంఘటనపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
byte:- గగ్గలపల్లీ కాంగ్రెస్ ఎంపిటిసి అభ్యర్థి e దొడ్ల వెంకట నారాయణ రెడ్డి

Body:TG_MBNR_7_29_TRS_CONG_WITHDRAW_THREAT_AVB_C8

Conclusion:TG_MBNR_7_29_TRS_CONG_WITHDRAW_THREAT_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.