ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్. జిల్లాలోని జటప్రోలు, గోప్లాపూర్ గ్రామాల్లో కలెక్టర్ శ్రీధర్, జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, పరిసరాల పరిశుభ్రత మొదలైన సమస్యల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటాలని సూచించారు. పాలనాధికారి శ్రీధర్ పార పట్టి చెత్తను ఊడ్చారు.
ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'