ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు - నాగర్​కర్నూల్​

నాగర్​కర్నూల్​ జిల్లాలోని నెల్లికొండ మార్కెట్​ గోదాం, ఉయ్యాలవాడ వద్దనున్న కళాశాలలో ఓట్లు లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు
author img

By

Published : May 21, 2019, 10:27 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లాలో లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు. నెల్లికొండ మార్కెట్​ గోదాం, ఉయ్యాలవాడ సమీపంలోని బీఎడ్​ కళాశాలల వద్ద చేసిన లెక్కింపు కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు దినేష్​తో కలిసి నాగర్​కర్నూల్​, వనపర్తి, గద్వాల జిల్లా కలెక్టర్లు శ్రీధర్​, శ్వేతామహంతి, శశాంక పరిశీలించారు. నాగర్​కర్నూల్​, కొల్లాపూర్​, అచ్చంపేట నియోజవర్గాలకు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్​ గోదాం వద్ద, గద్వాల, వనపర్తి, కల్వకుర్తి, అలంపూర్​ నియోజకవర్గాలకు ఉయ్యాలవాడ వద్ద లెక్కించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు

ఇవీచూడండి: పొరపాట్లకు తావు లేకుండా లెక్కింపు జరగాలి

Intro:TG_MBNR_11_21_COLLECTOR_ON_MP_ELECTION_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
గమనిక :-లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన వీడియోలు ఎఫ్.టి.పి ద్వారా పంపడం జరిగింది ఇదే స్లగ్గు తో గమనించగలరు
( ) నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపుకు కావలసిన అన్ని ఏర్పాట్లను కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఇ శ్రీధర్ పేర్కొన్నారు. 23న జరిగే పార్లమెంటు ఎన్నికల లెక్కింపు కేంద్రాలు అయినా నెల్లి కొండ మార్కెట్ గోదాం అలాగే ఉయ్యాలవాడ వద్ద ఉన్న మోడల్ బి.ఎడ్ కళాశాల వద్ద ఏర్పాట్లను నాగర్కర్నూల్, వనపర్తి ,గద్వాల జిల్లా కలెక్టర్లు శ్రీధర్ ,శ్వేతా మహంతి, శశాంక నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు దినేష్ ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు... 23 న జరిగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని నాగర్కర్నూల్ ,కొల్లాపూర్ ,అచ్చంపేట నియోజకవర్గాల కు నెల్లికొండ వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ గోదామని గద్వాల, వనపర్తి,కల్వకుర్తి ,అలంపూర్ నియోజకవర్గాలకు ఉయ్యాలవాడ వద్ద ఉన్న మోడల్ బి ఈడి కళాశాల వద్ద ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత సిబ్బంది ఉంటారని కౌంటింగ్ కి సంబంధించిన ఐడి కార్డులు ఉంటేనే లోపలికి అనుమతిస్తారని పేర్కొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ కేంద్రంలో మొదట పోస్టల్ బ్యాలెట్ ని లెక్కిస్తారని మిగిలిన నియోజకవర్గాల్లో అన్ని ఎనిమిది గంటలకే ఈ వియం లెక్కింపు ప్రారంభమవుతుందని ఆ తర్వాత 8 గంటల 30 నిమిషాల నుంచి నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను లెక్కిస్తారని ఈవీఎం ల లెక్కింపు ప్రక్రియ అయిపోయిన తర్వాత ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఐదు వివి ప్లాట్ లను డ్రా ద్వారా ఎన్నుకొని ఒక్కో వి.వి పాట్ తర్వాత మరోటి కౌంటింగ్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వివి పాట్లు కౌంటింగ్ అయిన తర్వాతనే ఫైనల్ గా రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Body:TG_MBNR_11_21_COLLECTOR_ON_MP_ELECTION_AVB_C8

Conclusion:TG_MBNR_11_21_COLLECTOR_ON_MP_ELECTION_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.