నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో జిల్లా పాలనాధికారి శర్మన్ ఉదయపు నడక చేపట్టారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక, రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈనెల 30 వరకు పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని మురుగు కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీచూడండి.. లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి