నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు గ్రామ పంచాయతీని కలెక్టర్ ఎల్.శర్మాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, హరితహారం గురించి గ్రామంలో తిరుగుతూ గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదిక భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
డంపింగ్ హార్డు, శ్మశాన వాటిక, గ్రామంలోని ఊరకుంట కట్ట, రోడ్డు విస్తీరణ పనులను పరిశీలించారు. రోడ్లపై మురుగు నీరు చూసిన కలెక్టర్ డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంట్లవెళ్లి, పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్, కొల్లాపూర్లలో పర్యటించారు.