ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించేందుకు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి జిల్లాలోని పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పరిశీలించనున్నారు. ముందుగా కర్వేన వద్ద రిజర్వాయర్ పనులను పరిశీలించి, అనంతరం నాగర్కర్నూల్ జిల్లాలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. అక్కడి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లపూర్ వద్ద ప్రాజెక్టు పనులు, అలాగే ఎదుల వద్ద రిజర్వాయర్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో కలిసి పరిశీలిస్తారు.
ఇవీచూడండి: రోగులతో పాలమూరు దవాఖానాలు కిటకిట