ETV Bharat / state

అడవి బిడ్డలపై దాడి అమానవీయం: భట్టి విక్రమార్క

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అడవి బిడ్డలపై దాడి అమానవీయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

bhatti vikramarka
భట్టి విక్రమార్క
author img

By

Published : Mar 28, 2021, 4:52 PM IST

అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై అటవీ శాఖ సిబ్బంది దాడి చేయడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహాం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై దాడి జరిగిందని.. 14 మహిళలు, 9 మంది పురుషులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్‌ చేశారు.

అచ్చంపేట మండలం చెంచు పలుగు తండా, గుంపన్​పల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు శుక్రవారం బల్మూరు మండలం బాణాల అడవి ప్రాంతంలోని బండచెల్మి సమీపంలో ఇప్పపువ్వు, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లారని చెప్పారు. చీకటి పడటంతో ఓ చోట భోజనాలు వండుకుని అక్కడే పడుకున్నారన్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అటవీ అధికారులు గిరిజనులు నిద్రిస్తున్న స్థలానికి చేరుకుని కర్రలతో తీవ్రంగా చితకబాదటం అత్యంత హేయం, అమానవీయమని వ్యాఖ్యానించారు.

మహిళలని చూడకుండా మగ సిబ్బంది బట్టలిప్పించి కొట్టారని, ఇలా దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా వుందన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించడం తప్పు కాదని.. చెంచు, లంబాడాలు అటవీ ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 29 రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందవచ్చని అటవీ చట్టం చెబుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మొన్న నక్సల్​.. నిన్న రిక్షావాలా... రేపు ఎమ్మెల్యే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.