ETV Bharat / state

పుర ప్రచారంలో తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల​ మధ్య ఘర్షణ - Nagar Kurnool district latest news

అచ్చంపేట పురపాలిక ఎన్నికల ప్రచారంలో తెరాస, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు సర్వే పేరుతో తెరాసకు అనుకూలంగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

Clashes between Trs and Congress during municipal election campaign in Achampet
అచ్చంపేటలో కాంగ్రెస్​, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణ
author img

By

Published : Apr 24, 2021, 7:09 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల ప్రచారంలో తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జీనత్ బేగం ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు సర్వే పేరుతో తెరాసకు అనుకూలంగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

వారిని అడ్డుకోవడంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అదే సమయానికి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఇరు పార్టీల కార్యకర్తలు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను ఠాణాకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి: 90ఏళ్ల తాత.. కరోనాను రెండుసార్లు జయించి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.