నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో చివరి రోజు రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగింది. అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి నామపత్రాలు దాఖలు చేశారు. కల్వకుర్తి జడ్పీటీసీ స్థానం కోసం తెరాస తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ నామ పత్రాలను దాఖలు చేశారు. మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు.
ఇవీ చూడండి: ఆంధ్రాలో తుపాను... తెలంగాణలో వడగాల్పులు...