ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో ఘనంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు - telangana latest news

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు. వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Chief Minister's birthday celebrations in Nagar Kurnool
నాగర్​కర్నూల్​లో ఘనంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Feb 17, 2021, 4:24 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటి వృక్షార్చనలో భాగంగా పార్లమెంట్ సభ్యులు రాములు, జడ్పీ ఛైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణానది నుంచి వస్తున్న సాగు నీళ్లతో సమృద్ధిగా పంటలు పండుతుండటంతో సీఎం చిత్రపటానికి కృష్ణా జలాలతో జలాభిషేకం, జిల్లాలో పండిన పంటలతో ధాన్యాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం 67 కిలోల కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Chief Minister's birthday celebrations in Nagar Kurnool
నాగర్​కర్నూల్​లో ఘనంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు

అనంతరం ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత మర్రి జనార్దన్​రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్​ కప్​-​2021 జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్​ను ప్రారంభించారు. నియోజకవర్గంలోని సుమారు 150 జట్లు ఈ టోర్నమెంట్​లో పాల్గొంటున్నాయి. వారం రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్​రెడ్డి, కవి, గాయకుడు సాయిచంద్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్​ నూరేళ్లు జీవించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.