అటవీశాఖ అధికారులు, సిబ్బంది గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ... దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెంచులు(CHENCHU TRIBE) ఆత‌్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన రాములు ఆరోపించారు. గతకొన్ని ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటూ బతుకుతున్న తమను... ఇప్పుడు అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
అధికారులు ఇబ్బంది కలిగిస్తే తమకు జీవనాధారం కరవవుతుందని వాపోయారు. అంతేకాకుండా తన చావుతోనైనా చెంచుల సమస్యలు పరిష్కారమవ్వాలని రాములు ఆత్మహత్య చేసుకోవడానికి అడవిలోకి వెళ్లిన దృశ్యాలు వైరల్‌గా(VIRAL VIDEO) మారాయి. సమస్యలతో కూడిన రెండు పేజీల డిమాండ్లను వాట్సప్ ద్వారా అధికారులకు చేరవేశారు
ఎన్నో పోరాటాలు చేశాం. ఎందరో అధికారుల దగ్గరకు తిరిగాం. అంతటా అవమానాలే జరిగినయ్. అయినా అటవీ హక్కుల చట్టాల ప్రకారం పోరాటం చేశాం. మా జాతిని కాపాడాలని కోరుకుంటున్నాం. మా సావుతోనైనా చెంచులకు న్యాయం జరుగుతుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
-రాములు, చెంచు జాతికి చెందిన వ్యక్తి
ఇదీ చదవండి: Revanth Reddy: 'రాజకీయంగా నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు'