నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్థానిక వాక్ఫ్ కాంప్లెక్స్ మేరాజ్ మజీద్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. రెడ్‌క్రాస్ లయన్స్‌క్లబ్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదానంలో పాల్గొన్న వారికి గుర్తింపు పత్రాలను అందజేశారు. ముస్లిం మైనార్టీలు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందు సోదరులు పాలుపంచుకొని రక్తదానం చేశారు.
కరోనా మహమ్మారి కాలంలో రక్తం కొరత తీవ్రంగా ఉందని ఈ సందర్భంలో శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని హనుమంత్ రెడ్డి అన్నారు. యువకులందరూ రక్తదానం చేయాలని సూచించారు. సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఏడాది మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు, హిందూ సోదరులు, లయన్స్‌క్లబ్, టీఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నాగర్ కర్నూల్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు