అవినీతి రహిత పాలనతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా రాష్ట్ర అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వేముల నరేందర్ రావు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని సిద్ధాపూర్లో నూతన గ్రామీణ మండల పార్టీ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నరేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం అవినీతి రహిత పాలనతో అభివృద్ధి పథంలో సాగుతోందని నరేందర్ తెలిపారు.
పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు బయట పడ్డాయన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాల్లో కార్యకర్తలు అహర్నిశలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి ఫలాల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. అప్పుడే దేశంలో మరోసారి మోదీ నాయకత్వం వస్తుందని... ఆయన హయాంలోనే రాష్ట్రంలో భాజాపాను గెలిపించుకోవచ్చని నరేందర్ వివరించారు.