ETV Bharat / state

క్రీడలకు పుట్టినిల్లు నల్లమల ప్రాంతం: డీకే అరుణ - భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వార్తలు

నాగర్ కర్నూల్​ జిల్లా అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియంలో ప్రైమ్ మినిస్టర్ కప్ 2021 క్రికెట్ పోటీలను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేజ్ డెవలప్​మెంట్ ఫౌండేషన్ సహకారంతో 120 జట్లకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.

BJP National Vice President DK Aruna inaugurated the Prime Minister's Cup 2021 cricket tournament at achampet ntr stadium
క్రీడకలకు పుట్టినిల్లు నల్లమల ప్రాతం: డీకే అరుణ
author img

By

Published : Feb 6, 2021, 4:42 PM IST

Updated : Feb 6, 2021, 7:21 PM IST

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్​ జిల్లా అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియంలో ప్రైమ్ మినిస్టర్ కప్ 2021 క్రికెట్ పోటీలను ఆమె ఘనంగా ప్రారంభించారు. బ్యాట్​ పట్టి తనదైన శైలిలో క్రికెట్​ ఆడారు. క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేజ్ డెవలప్​మెంట్ ఫౌండేషన్ సహకారంతో క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.

క్రీడకలకు పుట్టినిల్లు నల్లమల ప్రాతం: డీకే అరుణ

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, విలేజ్ డెవలప్​మెంట్ ఫౌండేషన్ ముందుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. అచ్చంపేట నల్లమల ప్రాంతం క్రీడలకు పుట్టినిల్లు అని కొనియాడారు. 120 జట్లకు క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి, వీడిఫ్ అధ్యక్షులు శ్రీకాంత్ భీమా, స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ మార్గంలో నడవాలి: గుత్తా

Last Updated : Feb 6, 2021, 7:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.