ETV Bharat / state

రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - nagarkurnool district latest news

దిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట వివిధ పార్టీల నాయకులు బైఠాయించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాజపాయేతర పార్టీలు పాల్గొన్నాయి.

bharat bandh at kalwakurthy in nagarkurnool district
రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
author img

By

Published : Dec 8, 2020, 9:07 AM IST

భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అన్నదాతలను మోసం చేస్తోందని... వాటిని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్​లో భాగంగా ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు.

దిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా బంద్ నిర్వహిస్తున్నామని, కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భాజపాయేతర శ్రేణులు బంద్​ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ఆందోళనలో తెరాస శ్రేణులు, కాంగ్రెస్, తెదేపా, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బంద్​కు విపక్షాల మద్దతు.. చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.