నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 పేద కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. ట్రస్ట్ ఛైర్మన్, నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ ప్రతీ ఇంటికి తిరుగుతూ కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ... అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ట్రస్ట్ ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుశీల, తెరాస నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రమాదంలో క్షౌర వృత్తిదారులు