నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో వివిధ గ్రామాల క్రిమిసంహారక, ఎరువుల విత్తన దుకాణ యజమానులతో కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సదస్సులో పాల్గొని అవగాహన కల్పించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అమ్మకాలు చేసే యజమానులు నిబంధనలకు లోబడి ఎరువులు, విత్తన విక్రయాలు చేపట్టాలని ఆయన సూచించారు.
క్రిమిసంహారక మందులు, విత్తనాలు ఎరువులను అధిక మొత్తంలో నిల్వ చేయకూడదని... ఒకవేళ నిల్వచేసినా వాటికి ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సిందిగా గిరిబాబు పేర్కొన్నారు. ఎరువుల దుకాణాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అమ్మకందారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు పొంది ఉండాలని వివరించారు. ప్రతి కొనుగోలుకు రైతులకు తప్పనిసరిగా బిల్లులు అందజేయాలని యజమానులకు తెలిపారు.
ఇవీ చూడండి: గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్ విజృంభణ!