నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వీఆర్ఓలు దస్త్రాలను అప్పగించారు. తహసీల్దార్ల నుంచి దస్త్రాల వివరాల సమగ్ర నివేదిక కలెక్టర్లు సేకరించి సాయంత్రం 5 గంటల వరకు సీఎస్ కు అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో వీఆర్వో వ్యవస్థలో మొత్తం 226 మందికి గాను 183 మంది తమ విధులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో వీఆర్ఓలు దస్త్రాలను అప్పగించారు.