నాగర్‌కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధుల సమ్మేళనం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అద్భుతంగా పనిచేశారని మంత్రి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతిని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్య పరిచే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేన్నారు.
గ్రామాల్లో తమకు గౌరవప్రద స్థానం కల్పించాలని ఎంపీటీసీలు వేదికపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు నిధులు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని సమస్యలను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, కలెక్టర్ శ్రీధర్, జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆయన ఒక్క తన్ను తన్నారంటే.. భక్తులు పరవశించిపోతారంతే!