నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగుల, గుండూరు, లింగసానిపల్లి, రఘుపతిపేట గ్రామాల్లో అదనపు కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, నాటవలసిన మొక్కలు, ఆయా గ్రామాల్లో తీసిన గోతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామ కార్యదర్శులతో నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కల రక్షణకు కంచె నిర్మించాలని సూచించారు. ఆరో విడత హరితహారంలో ప్రజలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం