రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరకు రవాణా చేసేందుకు ఆర్టీసీ కార్గో సేవలను తీసుకువచ్చిందని అచ్చంపేట బస్ డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపోకు కేటాయించిన ఆర్టీసీ కార్గో బస్సును డిపో మేనేజర్ మనోహర్ ప్రారంభించారు.
ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని డీఎం మనోహర్ చెప్పారు. ఇప్పటివరకు ఆర్టీసీలో కొరియర్, పార్సిల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సేవలను వ్యాపారస్తులు ఉపయోగించుకోవాలని సూచించారు. వివిధ రకాల వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా చేరవేసేందుకు ఈ కార్గో సేవలను ఆర్టీసీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సురేందర్, జోగయ్య, చంద్రయ్య, లింగం, బాలాజీ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానుల వ్యథ వర్ణనాతీతం