నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు బొలెరో వాహనంలో పత్తి తీసేందుకు బయలుదేరారు. బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి వెళ్తుండగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో బొలెరో ఒక్కసారిగా అదుపుతప్పినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇవీ చూడండి: మూడో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన బాబాయి