నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోని ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు అనురాధ అనే యువతితోపాటు రెండు ఎద్దులు మృతి చెందాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా... పురిగూడిసెపై పిడుగు పడి ఈ దారుణం జరిగింది. నిరుపేద కుటుంబంలో చేతికందొచ్చిన అమ్మాయి, వ్యవసాయం చేసుకుంటున్న రెండు ఎద్దులు మృతి చెందటం వల్ల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు